Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ కార్డెన్ సెర్చ్!
Adilabad: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రణదీవేనగర్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ కార్డెన్ సెర్చ్!
Adilabad: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రణదీవేనగర్ లో బుధవారం తెల్లవారుజాము నుంచి కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సర్చ్) కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా తిరుగుతూ సరైన పత్రాలు లేని 107 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, ఒక కారు తో పాటు మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నంబర్ ప్లేట్, రిజిస్టర్ లేని వాహనాలపై కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులతో ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా నియమాలు పాటించాలన్నారు. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.
గంజాయి తాగుతూ పట్టుబడిన వారిని డి-అడిక్షన్ సెంటర్ లకు పంపిస్తామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.




