Adilabad: గుడిహత్నూర్: సీతగొంది కేంద్రాన్ని ఖాళీ చేయాలన్న తహశీల్దార్!
Adilabad: గుడిహత్నూర్: సీతగొంది మత్స్య పెంపకం కేంద్రం వద్ద మళ్లీ వరద ముప్పు. నివాసముంటున్న కుటుంబాన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తహశీల్దార్ ఆదేశం.
Adilabad: గుడిహత్నూర్: సీతగొంది కేంద్రాన్ని ఖాళీ చేయాలన్న తహశీల్దార్!
భారీ వర్షాల హెచ్చరిక: సీతగొంది మత్స పెంపకం కేంద్రం కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన
గుడిహత్నూర్:
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతగొంది గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న మత్స్య పెంపకం కేంద్రం వద్ద మళ్లీ వరద భయం నెలకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఈ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది.
గత ఏడాది కూడా భారీ వర్షాల తీవ్రతకు ఈ కేంద్రంలో పనిచేసే కుటుంబం వరద నీటిలో చిక్కుకోగా, అధికారులు తీవ్రంగా శ్రమించి వారిని రక్షించాల్సి వచ్చింది. ఈసారి అలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ముందస్తు రక్షణ చర్యగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుడిహత్నూర్ తహశీల్దార్ కవిత స్థానిక కేంద్రాన్ని సందర్శించారు.
అక్కడి పరిస్థితిని సమీక్షించిన తహశీల్దార్, నివాసముంటున్న కుటుంబాన్ని వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత స్థానాలకు తరలివెళ్లాలని సూచించారు. అధికారులు వారికి అవసరమైన సహాయక చర్యలు అందిస్తారని, వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.




