Ichoda: కేశవపట్నంలో ఘర్షణ: కర్రలు, రాళ్లతో దాడి.. నలుగురికి గాయాలు!

Ichoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘర్షణ. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సీఐ రమేష్.

NAGULA SATISH, BOATH
Published on: 11 Sept 2026 6:55 PM IST
Ichoda
X

Ichoda: కేశవపట్నంలో ఘర్షణ: కర్రలు, రాళ్లతో దాడి.. నలుగురికి గాయాలు!

​ఇచ్చోడ: మండలంలోని కేశవపట్నం గ్రామంలో జామా మసీదు సమీపంలో చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సిహెచ్. రమేష్ తెలిపారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

​ఈ నెల 9వ తేదీ సాయంత్రం షేక్ అనీస్ అనే వ్యక్తి తన మామ రంజాన్ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, గ్రామ మసీదు సమీపంలో కొందరు వ్యక్తులు అతడిని అడ్డుకున్నారు. తమ ఇంటి సమీపం నుంచి తరచూ ఎందుకు వెళ్తున్నావంటూ వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న అనీస్ సోదరుడు షేక్ ఇద్రిస్ తన బంధువులతో కలిసి సంబంధిత వ్యక్తులను ప్రశ్నించేందుకు వెళ్లగా, నిందితులు ఒక్కసారిగా గుంపుగా ఏర్పడి వారిపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు.

​ఈ దాడిలో షేక్ అనీస్‌తో పాటు సోహెల్‌కు ఛాతిపై బలమైన గాయాలయ్యాయి. రషీద్, సలీమ్‌లకు తలపై రక్తగాయాలు కాగా, సలీమ్ ఎడమ చేతికి కూడా తీవ్ర గాయమైంది. నిందితులు తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడినట్లు బాధితులు పేర్కొన్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాల్సి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైందని తెలిపారు.

​బాధితుల ఫిర్యాదు మేరకు కేశవపట్నం గ్రామానికి చెందిన దాదూ అలియాస్ ఆదిల్, ఎస్.కె. రఫీక్, ఎస్.కె. కలా అలియాస్ అర్బాజ్, ఎస్.కె. తౌఫీక్, ఎస్.కె. సోహెల్, షారుఖ్, ఎస్.కె. తబ్రీజ్, షేక్ షకీల్, ఎస్.కె. నజీర్‌లపై బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 109, 296(b) r/w 190 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH