Gudihatnoor: గుడిహత్నూర్ మండలం తోషంలో నూతన గ్రంథాలయం ప్రారంభం

Gudihatnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషంలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి ప్రారంభించారు.

NAGULA SATISH, BOATH
Published on: 27 Aug 2026 8:36 PM IST
Gudihatnoor
X

Gudihatnoor: గుడిహత్నూర్ మండలం తోషంలో నూతన గ్రంథాలయం ప్రారంభం

గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన యూనిఫాంలను పంపిణీ చేయడంతో పాటు సద్గురు పూలాజీబాబా 102వ జన్మదిన మహోత్సవ పోస్టర్‌ను అతిథులు ఆవిష్కరించారు.

​కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ యువత పుస్తక పఠనాన్ని దినచర్యగా మార్చుకొని, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సిద్ధం కావడానికి లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. లైబ్రరీల నిర్వహణకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పాఠకుల వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, గ్రామంలోని రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

​అనంతరం ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టి ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని సూచించగా, చైర్మన్ నర్సయ్య లైబ్రరీలో పూర్తిస్థాయి వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, తహసీల్దార్ కవితా రెడ్డి, ఎంపీడీవో ఇంతియాజ్ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story