Adilabad: భారీ వర్షాల హెచ్చరిక ఆదిలాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్!

Adilabad: ఆదిలాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం అలర్ట్. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసిన చైర్‌పర్సన్ అనూష.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 July 2026 8:09 PM IST
Adilabad
X

Adilabad: భారీ వర్షాల హెచ్చరిక ఆదిలాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్!

ఆదిలాబాద్: భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ యంత్రంగం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తెలిపారు. శనివారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.

వర్షాల నేపథ్యంలో మున్సిపాలిటీ తరపున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 9000018842 ఏర్పాటు చేశామన్నారు. పట్టణ వాసులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story