Adilabad: రెండు నెలల్లో ROB, RUB పనులు పూర్తి చేస్తాం: పాయల శంకర్
Adilabad: ఆదిలాబాద్‌లో రెండు నెలల్లో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ పనులు పూర్తి చేసి తెలంగాణ-మహారాష్ట్ర మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని ఎమ్మెల్యే పాయల శంకర్ తెలిపారు.
Adilabad: రెండు నెలల్లో ROB, RUB పనులు పూర్తి చేస్తాం: పాయల శంకర్
Adilabad: ఆదిలాబాద్ పట్టణంలో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ (ROB, RUB) నిర్మాణ పనులను రానున్న రెండు నెలల్లోగా పూర్తిగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే పాయల శంకర్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలో కొనసాగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఈ పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి, తెలంగాణ-మహారాష్ట్ర రోడ్డుపై ప్రజలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తామన్నారు.
ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్, ఇండస్ట్రీ కారిడార్‌లతో పాటు రైళ్ల రాకపోకలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.




