Adilabad: ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్!
Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని 8, 9, 40, 13, 14 వార్డుల్లో యు.ఐ.డి.ఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్.
Adilabad: ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్!
ఆదిలాబాద్: పట్టణలోని పలు వార్డులలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డ్ నెంబర్ 8,9,40,13,14 లలో చేపట్టిన యు.ఐ.డి.ఎఫ్. నిధులతో సీసీ, డ్రైన్స్ మరియు రోడ్స్, నిర్మాణల పనులకు మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష
తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించగా.. నాణ్యత పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదిలాబాద్ భవిష్యత్తులో గొప్ప పట్టణంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ మేరకు ఆయా వార్డులలో రూ: 55 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా అమృత పథకంలో సైతం పనులు జరుగుతున్నాయన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత పట్టణాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ ఆదర్శ పట్టణంగా తీర్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.




