Adilabad: ఆదిలాబాద్‌లో యాంటీ డ్రగ్స్ ‘5కే రన్’

Adilabad: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా యాంటీ డ్రగ్స్ ‘5కే రన్’.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 26 Jun 2026 1:37 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో యాంటీ డ్రగ్స్ ‘5కే రన్’

Adilabad: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో నిర్వహించిన ‘5కే రన్’ కు మంచి స్పందన వచ్చింది.. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ పరుగును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పరుగులో ప్రతిభ చాటి మొదటి 10 స్థానాల్లో నిలిచిన యువతి, యువకులకు సైకిళ్లను బహుమతిగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. నార్కో టెర్రరిజం ద్వారా దేశ వ్యతిరేక శక్తులు యువతను తప్పుదోవ పట్టించి సమాజాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అంతర్జాతీయంగా డ్రగ్స్ మీద భారతదేశంపై కుట్ర జరుగుతుందన్నారు. ఉచితంగా మత్తు పదార్థాలు ఇచ్చి యువతకు అలవాటు చేసి దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు.

రకరకాల రూపంలో గంజాయి వస్తున్నదని.. వాటిని బారిన పడవద్దని యువతకు సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ఎస్పి అఖిల్ మహాజన్ కోరారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని స్పష్టం చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story