Adilabad: గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు: పోలీసులు హెచ్చరిక!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పత్తి చేనులో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, రూ. 12.50 లక్షల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Adilabad: గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు: పోలీసులు హెచ్చరిక!
Adilabad: నేరడిగొండ మండలం బోరిగాం గ్రామ శివారులోని పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఆడే కపిల్ (33) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు, సుమారు 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 125 గంజాయి మొక్కలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గంజాయి మొక్కల విలువ సుమారు రూ.12.50 లక్షలు ఉంటుందని ఇచ్చోడా రూరల్ సీఐ సిహెచ్ రమేష్ తెలిపారు. తన భార్య పేరిట ఉన్న 3.7 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ (ROFR) భూమిలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో నిందితుడు ఈ అక్రమ సాగుకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడిపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి సాగు, రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా సిఫార్సు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




