Gudihatnur: ఆధార్ లేక బడికి దూరమైన బాలికకు మళ్లీ పాఠశాల ప్రవేశం
Gudihatnur: ఆధార్ లేక బడికి దూరమైన బాలిక షర్మిలను గుడిహత్నూర్ ఉమ్రి-బి పాఠశాలలో చేర్పించిన హెచ్ఎం దేవదాస్, సర్పంచ్ నజియో బేగం. సోషల్ మీడియా వార్తలపై స్పందన.
Gudihatnur: ఆధార్ లేక బడికి దూరమైన బాలికకు మళ్లీ పాఠశాల ప్రవేశం
గుడిహత్నూర్: ఆధార్ కార్డు లేక బడికి దూరంగా బాలలు" అనే అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గుడిహత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెచ్‌ఎం రాచకొండ దేవదాస్ తక్షణమే స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన సూర్యగూడ గ్రామానికి వెళ్ళి, స్థానిక సర్పంచ్ నజియో బేగం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్‌లతో కలిసి ఆధార్ లేక బడికి దూరంగా ఉంటున్న కాత్లె షర్మిల కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం బాలిక షర్మిలను వెంటనే ఉమ్రి-బి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించారు. బాలికకు ఆధార్ కార్డు లేకపోవడమే బడికి దూరమవ్వడానికి అసలు కారణమని తెలుసుకున్న కాంప్లెక్స్ హెచ్‌ఎం రాచకొండ దేవదాస్, సర్పంచ్ నజియో బేగంతో కలిసి ఆధార్ సెంటర్ ద్వారా త్వరలోనే ఆధార్ కార్టు ఇప్పించే పూర్తి బాధ్యతను స్వీకరించారు. సమస్యను సామాజిక మాధ్యమం ద్వారా గుర్తించి, వెంటనే స్పందించి విద్యార్థినిని తిరిగి బడిలో చేర్పించిన అధికారులను స్థానికులు, గ్రామస్థులు అభినందించారు.




