Adilabad: దారి కోసం ఎడ్లబండిపై కలెక్టరేట్‌కు వచ్చిన రైతు
Adilabad: అదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఒక వినూత్న ఘటన చోటుచేసుకుంది.
Adilabad: దారి కోసం ఎడ్లబండిపై కలెక్టరేట్‌కు వచ్చిన రైతు
Adilabad: తన వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు దారి చూపించాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు జిల్లా కలెక్టర్ ను కలిసేందుకోసం తమ గ్రామం నుండి జిల్లా కలెక్టరేట్ కు ఎడ్ల బండి పై తరలివచ్చాడు.. అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ అనే రైతు తన 12 ఎకరాల పొలానికి వెళ్లేందుకు చుట్టుపక్కల ఉన్న పలువురు రైతులు దారి ఇవ్వడం లేదని, దీంతో పొలానికి వ్యవసాయ పనుల కోసం వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నానని, ఎడ్ల బండి వెళ్లేందుకు సదరు చుట్టుపక్కల పొలాల రైతులు దారి ఇవ్వకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని, ఇదే విషయమై తలమడుగు రెవెన్యూ అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్ల బండి పై వచ్చానని తెలిపారు లక్ష్మణ్.. జిల్లా కలెక్టర్ రాజర్సీ షా ను కలిసి విన్నవించడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్యపై రెవెన్యూ అధికారులకు పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.




