Adilabad: ఇంటింటా తిరుగుతూ అంగన్‌వాడీల్లో చేర్పించిన కౌన్సిలర్
Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిత్య నగర్ (12వ వార్డు) లో చిన్నపిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించే బడిబాట కార్యక్రమం ఘనంగా జరిగింది.
Adilabad: ఇంటింటా తిరుగుతూ అంగన్‌వాడీల్లో చేర్పించిన కౌన్సిలర్
ఆదిలాబాద్: అంగన్వాడిలో చిన్నారులకు అక్షర శ్రీకారం చుట్టించి బడిబాట పట్టించారు.. బడి అక్షరాలు నేర్పే నేర్చుకునే పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిత్య నగర్ వార్డ్ నెంబర్ 12 లో అంగన్వాడీలో చిన్నపిల్లల చేర్పించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు..
వాడు కౌన్సిలర్ ఆత్రం సాయి కృష్ణ, సిబిఎస్ అధికారులతో కలిసి ఇంటింటా తిరుగుతూ చిన్నపిల్లలను అంగన్వాడిలో చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా అంగన్వాడి కి వచ్చిన పిల్లలందరికీ సాంప్రదాయబద్ధంగా అక్షర శ్రీకారం నిర్వహించి యూనిఫాంలో అందించారు..
అంగన్వాడిలో చేరిన పిల్లలందరికీ పౌష్టిక ఆహారం అందించడం తో పాటు చదివి నేర్పించి అలనా పాలన చూసుకోవడం జరుగుతుందని ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి అవునూరి కావేరి, కాలనీ వాసులు పాల్గొన్నారు..




