Adilabad: కాంగ్రెస్ కీలక సమావేశం.. ఓట్ల తొలగింపుపై దిశానిర్దేశం!
Adilabad: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ SIR సమావేశం. మాజీ ఎంపీ సోయం బాపూరావు, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హాజరు, ఓట్ల రక్షణపై BLA2లకు కీలక సూచనలు.
Adilabad: కాంగ్రెస్ కీలక సమావేశం.. ఓట్ల తొలగింపుపై దిశానిర్దేశం!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఓ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ GCC ఛైర్మన్ కోట్నాక్ తిరుపతి, DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు పాటు పలువురు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగిపోకుండా తీసుకోవలసిన చర్యలపై బీఎల్ఎ2లకు దిశానిర్దేశం చేశారు.మరోవైపు ఈ సమావేశానికి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ గైర్హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ రాజకీయ నాయకులు అన్నప్పుడు తప్పనిసరిగా గ్రూపు రాజకీయాలు ఉంటాయని.. కాని కార్యకర్తలు మాత్రం గ్రూపులుగా ఉండొద్దని,కార్యకర్తలు అంటేనే కాంగ్రెస్ పార్టీ గ్రూప్ అని, పనిచేసే కట్టర్ కార్యకర్తలని పేర్కొన్నారు. బీజేపీ నేతలు సర్వే చేయిస్తున్నారని.. ఆ సర్వేలో వారికే వ్యతిరేకంగా రిపోర్టులు వస్తున్నాయని.. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు.
అనంతరం డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తకే గుర్తింపు తో పాటు పదవులు వరిస్తాయని,ఎవరికి కూడా వ్యక్తిగతంగా.. లాలూచీపడి తాను పనిచేయని.. కేవలం తన జెండా ఎజెండా కేవలం కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. వ్యక్తిగత లాభాలు కోసం పాటుపడే వారికి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదని పేర్కొన్నారు. కొంతమంది నేతలు తనపై ఏవేవో ఆరోపణలు చేసినప్పటికీ తాను మాత్రం క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలగా పనిచేస్తానని పేర్కొన్నారు
అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఎస్ఐఆర్ ఆదిలాబాద్ ఇంచార్జ్, మాజీ జిసిసి చైర్మన్ కోట్నాక్ తిరుపతి అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు వచ్చిన వారు ఆందోళన చెందవద్దని.. సరైన గుర్తింపు కార్డులు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే కార్యకర్తలే బలమని.. వ్యక్తులు ముఖ్యం కాదని అన్నారు.




