Adilabad: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ లీక్ నిరసన

Adilabad: నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా, ఎంపీ క్యాంప్ కార్యాలయం ముట్టడి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 22 July 2026 2:13 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ లీక్ నిరసన

ఆదిలాబాద్: నీట్ పేపర్ లీకేజ్ విషయంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాటి చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు.

విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనను అడ్డుకుంటూ ఆయనను అక్రమంగా అరెస్టు చెయ్యడాన్ని ఖండిస్తూ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. అనంతరం ఎంపీ నగేష్ క్యాంప్ కార్యాలయం ఎదుట ముట్టడి చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

కేంద్రంలోని భాజపా సర్కారు బ్రిటిష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, ఉన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story