Adilabad: ఆదిలాబాద్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు: ఘన నివాళులు!
Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్ ఆఫీస్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నేతలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Adilabad: ఆదిలాబాద్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు: ఘన నివాళులు!
Adilabad: ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని ప్రగతి పథంలో పయనింపచేసారని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, అన్నారు.
గురువారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ గది చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ రంగాలను ప్రవేశపెట్టి సాంకేతిక సమాచార విప్లవ పితామహుడిగా పేరు గడించారని ఆయన సేవలను కొనియాడారు.
మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 యేళ్లకు ఓటు హక్కుకల్పించిన మహానుభావుడన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి, గోలి సంజయ్, కిజార్, అన్నపూర్ణ తదితరులున్నారు.




