Adilabad: డబల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మితే రద్దు కలెక్టర్ రాజర్షి షా
Adilabad: ఆదిలాబాద్‌లో లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాల అందజేత. ఇళ్లు విక్రయిస్తే లేదా వేరే వారికి ఇస్తే వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరిక.
Adilabad: డబల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మితే రద్దు కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: ప్రభుత్వం కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులు వేరేవారికి కేటాయిస్తే చర్యలు ఉంటాయని.. లబ్ధిదారులు మాత్రమే నివసించాలని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు.
శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తో కలిసి లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రమును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డబల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మడానికి వీలు లేదన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి ఇళ్ళను క్యాన్సల్ చేస్తామని పేర్కొన్నారు.
బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేశామని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు.
ఇందులో భాగంగా కె.ఆర్.కె కాలనీ, మావల వద్ద గల డబల్ బెడ్ రూమ్ సముదాయాల వద్ద మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. లబ్ధిదారులు తమకున్న స్థలంలో మొక్కలను పెంచుకోవాలని సూచించారు. బెడ్ రూమ్ ఇళ్లను నాణ్యతతో కట్టడం జరిగిందన్నారు




