Utnoor: ఉట్నూర్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ ఐటీడీఏ పీవోతో సమీక్ష!
Utnoor: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి సందర్శించారు. పింఛన్ల దరఖాస్తులపై దిశా నిర్దేశం చేశారు.
Utnoor: ఉట్నూర్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ ఐటీడీఏ పీవోతో సమీక్ష!
Utnoor: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అదికారి మంద మకరందుతో కలిసి సందర్శించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు పెన్షన్ ల కోసం ఎదురు చూస్తున్న.విదవరాండ్లు,వికలాంగులు,వయోవృద్దులు తదితరులు ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అందుకోసం గ్రామ పంచాయతీ పరిధిలో అప్లికేషన్ ఫారాలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఇందుకోసం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటో,బ్యాంకు అకౌంట్,ఆ అకౌంట్ కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ తప్పకుండా జతపర్చాలన్నారు.ఆ తర్వాత అందిన అప్లికేషన్ లను అన్నింటినీ సవరించి పెన్షన్ లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు..




