Adilabad: వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్‌’ సెంటర్లు కలెక్టర్ రాజర్షి షా!

Adilabad: ఆదిలాబాద్‌లో 'ప్రణామ్' వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా. వృద్ధులకు అల్పాహారం వడ్డించి, ఆత్మీయంగా ముచ్చటించిన కలెక్టర్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 31 Aug 2026 3:20 PM IST
Adilabad
X

Adilabad: వృద్ధాప్యంలో ఆసరాగా ‘ప్రణామ్‌’ సెంటర్లు కలెక్టర్ రాజర్షి షా!

Adilabad: వృద్ధాప్యంలోఒంటరితనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపేందుకు ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్లు చక్కటి వేదికగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు.దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‘ప్రణామ్‌’ వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ కేంద్రంలోని వసతులను పరిశీలించారు. వృద్ధులకు అందుతున్న సేవలు, కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు...అనంతరం కలెక్టర్‌ స్వయంగా వృద్ధులకు అల్పాహారం వడ్డించారు. వారితో కలసి అల్పాహారం చేశారు. తమతో కలసి కూర్చొని ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్‌కు సీనియర్‌ సిటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మారుతున్న జీవన విధానంతో వయోవృద్ధులు ఒంటరితనానికి గురికాకుండా పగటి సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ‘ప్రణామ్‌’ డే కేర్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందన్నారు. వృద్ధులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలతోపాటు మానసిక ప్రశాంతత, సామాజిక భద్రత కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.

కేంద్రంలో అందించే రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ, వినోద కార్యక్రమాలు, పరస్పర ఆత్మీయత వృద్ధుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మిల్కా, తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story