Adilabad: ముర్రిపాలతో వ్యాధి నిరోధక శక్తి కలెక్టర్ రాజర్షి షా!

Adilabad: అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 5 Aug 2026 10:03 AM IST
Adilabad
X

Adilabad: ముర్రిపాలతో వ్యాధి నిరోధక శక్తి కలెక్టర్ రాజర్షి షా!

Adilabad: అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రిపాలు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వైద్య విద్యార్థులు ప్లాకార్డులతో ప్రదర్శన చేపట్టారు.

ప్రతి ఒక్కరూ తల్లి పాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, అందులో పుష్కలంగా రోగనిరోధక శక్తి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమన్నారు. పాలు రాకపోతే ఆవు పాలు, తేనె ఇస్తుంటారని, దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. రిమ్స్‌లో ప్రత్యేకంగా 'కంగారు మదర్ కేర్ సెంటర్' ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డిఎంహెచ్ఓ సాధన, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, వైద్యులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story