Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయంలో వైభవంగా ఓనం పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ!
Adilabad: ఆదిలాబాద్ బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఘనంగా ఓనం వేడుకలు. కేరళ తరహాలోనే ఉత్సవాలు జరగడం సంతోషకరమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా.
Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయంలో వైభవంగా ఓనం పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ!
Adilabad: కేరళ తరహాలోనే బెల్లూరి అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.. ఆదిలాబాదు బెల్లూరి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్శి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లో ముఖ్య అతిథిగా హాజరై పూజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో, అదే రీతిలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చరిత్ర కొనసాగుతోందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు.
గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది తాను ఓనం పండుగలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. భగవంతుని దర్శనం చేసుకుని, ఆశీస్సులు తీసుకుని జిల్లా అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, చదువులోనూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, భగవంతుడు అందరికీ శక్తినివ్వాలని కోరారు.
అదేవిధంగా ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని, మరిన్ని వసతులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ కండేశ్వర్, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి రమేష్, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు గణేష్, సత్యం, లక్ష్మణ్, మహేందర్, చల్లావార్ అనిల్, మూగ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.




