Adilabad: ఓనం పండుగ ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షీ షా, ఎస్పీ అఖిల్ మహాజన్

Adilabad: ఆదిలాబాద్ బెల్లూరి స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించనున్న ఓనం పండుగ ఉత్సవాల కరపత్రాలను కలెక్టర్ రాజర్షీ షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 24 Aug 2026 8:10 PM IST
Adilabad
X

Adilabad: ఓనం పండుగ ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షీ షా, ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి స్వామి ఆలయంలో ఈనెల 26వ తేదీ బుధవారం నిర్వహించే ఓనం పండుగ ఉత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్సీషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, పూజ నిర్వాహకులు సామ స్వామి రెడ్డి, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు చంద గణేష్, సత్యం, గౌరు లక్ష్మణ్ తోపాటు కార్యవర్గ సభ్యులు, గురు స్వాములు తోట సంతోష్, అక్షయ్, మూగ సుభాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కాగా మలయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే పూజా కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప దీక్షపరులు భారీ సంఖ్యలో హాజరు కావాలని, ఆలయంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమంతో పాటు పడిపూజ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story