Adilabad: ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత: జాతీయ రహదారి దిగ్బంధం, జోగు రామన్న అరెస్ట్!
Adilabad: ఆదిలాబాద్ దస్నాపూర్ బ్రిడ్జి వద్ద BRS ఆందోళన, జాతీయ రహదారి దిగ్బంధం. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్.
Adilabad: ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత: జాతీయ రహదారి దిగ్బంధం, జోగు రామన్న అరెస్ట్!
Adilabad: ఆదిలాబాద్ జాతీయ రహదారి దస్నాపూర్ బ్రిడ్జి వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎదుట నల్ల దుస్తులతో నిరసనకు వెళ్లిన బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారు.
మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ఆందోళనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామన్న అరెస్టును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసు కాన్వాయ్‌కు అడ్డంగా పడుకుని జోగు రామన్నను వెంటనే విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో దస్నాపూర్ బ్రిడ్జి పరిసరాల్లో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు.




