Adilabad: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేవైఎం మండిపాటు తీవ్ర నిరసన!
Adilabad: విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్‌లో బీజేవైఎం ఆందోళన చేపట్టింది. సీఎం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
Adilabad: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేవైఎం మండిపాటు తీవ్ర నిరసన!
విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అనుచితంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కాళ్లసాయి అన్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బీజేవైఎం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నేతలకు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని తీసుకెళ్లారు. విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.
Next Story




