Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఈనెల 26న ఘనంగా ఓనం ఉత్సవాలు !
Adilabad: అదిలాబాద్ బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 26న ఓనం ఉత్సవాలు. ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఆలయ కమిటీ నిర్వాహకులు.
Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఈనెల 26న ఘనంగా ఓనం ఉత్సవాలు !
Adilabad: అదిలాబాద్ పట్టణ సరిహద్దులోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 26న నిర్వహించే ఓనం పండుగ ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎంపీ గడం నగేష్, ఎమ్మెల్యే శంకర్, చైర్మన్ అనూష, జిల్లా కలెక్టర్ రాజర్సీషా, ఎస్పీ అఖిల్ మహజనులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
పండుగ ఉత్సవానికి సంబంధించి పోస్టర్లను అయ్యప్ప స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, గురు స్వామి సంతోష్ శర్మ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి తిప్పర్తి సత్యం, గౌరు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు విజయ్, నర్సింగ్, మధుకర్, మహేష్, దత్తు గురుస్వామి తదితరులు పాల్గొనగా, పూజ నిర్వాహకులు స్వామి రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని, మలయాళ సాంప్రదాయ పద్ధతిలో సాగే పూజా కార్యక్రమాలతో పాటు పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.భక్తులు, పట్టణ ప్రజల అధిక సంఖ్యలో హాజరుకావాలని ఈ సందర్భంగా వారు కోరారు.




