Adilabad: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఆశా కార్యకర్తల వినతి

Adilabad: ఆదిలాబాద్‌లో ఆశా కార్యకర్తలకు రూ. 18 వేల స్థిర వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 18 May 2026 5:58 PM IST
Adilabad
X

Adilabad: ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఆశా కార్యకర్తల వినతి

Adilabad: ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ: 18 వేల రూపాయలు చెల్లించడంతో పాటు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. ఆశల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సోమవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఆశాలతో శ్రమ దోపిడి చేయించుకుంటున్న ప్రభుత్వాలు వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆశాలకు ఉద్యోగ భద్రత తోపాటు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వేతనాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఆశాల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story