Adilabad: నీట్ లీకేజ్ బాధితులకు ₹కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి దత్తాత్రి

Adilabad: నీట్ లీకేజీతో మరణించిన వారి కుటుంబాలకు ₹కోటి పరిహారం ఇవ్వాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆదిలాబాద్‌లో రైతు సంఘం డిమాండ్ చేసింది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 24 July 2026 1:38 PM IST
Adilabad
X

Adilabad: నీట్ లీకేజ్ బాధితులకు ₹కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి దత్తాత్రి

ఆదిలాబాద్: నీట్ పరీక్ష లీకేజ్ కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అఖిలపక్షం రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా ఆదిలాబాద్ లోని జెడ్పి కార్యాలయం రహదారిపై అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు వెంకటనారాయణ, జగన్ సింగ్, లోకారి పోశెట్టి, రమేష్, దేవిదాస్, మంజుల, ఆరిఫా, ఉన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story