Adilabad: మున్సిపల్ కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి విలాస్

Adilabad: ఆదిలాబాద్‌లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్. సెప్టెంబర్‌లో సంఘం రాష్ట్ర మహాసభలు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 Aug 2026 3:48 PM IST
Adilabad
X

Adilabad: మున్సిపల్ కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి విలాస్

ఆదిలాబాద్: మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లోని సిపిఐ కార్యాలయంలో మున్సిపల్ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సెప్టెంబర్లో నిర్వహించనున్న సంఘం రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్మికుల కనీస వేతనం రూ:26 వేలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.

రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, రాజు, కార్మికులు తదితరులు ఉన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story