Adilabad: ఆదిలాబాద్‌లో 5కే రన్ జోష్.. విజేతలకు సర్టిఫికెట్లు ఇచ్చిన అదనపు కలెక్టర్!
Adilabad: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ఉత్సాహంగా సాగిన 5కే మారథాన్.
Adilabad: ఆదిలాబాద్‌లో 5కే రన్ జోష్.. విజేతలకు సర్టిఫికెట్లు ఇచ్చిన అదనపు కలెక్టర్!
Adilabad: శారీరక, మానసిక దృఢత్వం కోసం వ్యాయామం అలవాటు చేసుకోవాలని అదిలాబాద్ అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి నిర్వహించిన 5కే మారథాన్‌ను మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ మేరకు మారథాన్ ఉత్సాహంగా సాగింది. అనంతరం విజేతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఆరోగ్యంపై అవగాహన కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు కార్యక్రమ అతిథులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, క్రీడాకారులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




