Adilabad: గుడిహత్నూర్ బస్టాండ్‌లో పోలియో కేంద్రం.. సర్పంచ్ పరిశీలన!
Adilabad: మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పల్స్ పోలియో కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఆడే శీల చిన్నారులకు చుక్కలు వేశారు.
Adilabad: గుడిహత్నూర్ బస్టాండ్‌లో పోలియో కేంద్రం.. సర్పంచ్ పరిశీలన!
ఆదిలాబాద్ జిల్లా: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఆడే శీల సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె స్వయంగా చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ చిన్నప్పుడు వేసే రెండు పోలియో చుక్కలు పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచంలా నిలుస్తాయని, వారిని అంగవైకల్యం బారిన పడకుండా కాపాడుతాయని పేర్కొన్నారు.
కాబట్టి అప్పుడే పుట్టిన పసికందుల నుండి ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




