Asifabad: 12 గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Asifabad: 12 గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెజ్జూర్ మండలంలో కృష్ణపల్లి ఒర్రె నిండుగా పారుతోంది. దీంతో సుస్మీర్ సోమిన్, మొగవెల్లి, ఇప్పలగూడ సహా 12 గ్రామాలు మండల కేంద్రంతో సంబంధాలు కోల్పోయాయి.
రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చింతలమానేపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది ధిందా కేతిని గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి
బాబాసాగర్ వాగు ఉప్పొంగడంతో నాయకపుగూడా ప్రజలకు అంతరాయం ఏర్పడింది
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించి ఒర్రెపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story




