YS Sharmila: బీఆర్‌ఎస్‌పై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు..

YS Sharmila: ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని

Shekhar G
Published on: 26 July 2023 4:29 PM IST
YS Sharmila Comments On Brs Party Through Twitter
X

YS Sharmila: బీఆర్‌ఎస్‌పై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు.. 

YS Sharmila: బీఆర్‌ఎస్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల‎ మరోసారి విరుచుకుపడ్డారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన షర్మిల...BRS ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే అంటూ ఎద్దేవా చేశారు. అంతా ఎన్నికల కమిషన్‌ను తప్పు దోవ పట్టించిన వాళ్లే అని వ్యాఖ్యలు చేశారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత అని షర్మిల ఆరోపించారు.

లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి.. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ షర్మిల కోరారు.


Shekhar G

Shekhar G

Next Story