మరో ఫేస్ బుక్ మోసం..రూ.40లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌

మరో ఫేస్ బుక్ మోసం..రూ.40లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌
x
Highlights

పోలీసులు పదేపదే హెచ్చరిస్తూ, అప్రమత్తం చేస్తున్నా కొంతమంది అమ్మాయిలు మాత్రం మోసగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. సోషల్‌ మీడియాతో అమ్మాయిలకు వలేస్తున్న...

పోలీసులు పదేపదే హెచ్చరిస్తూ, అప్రమత్తం చేస్తున్నా కొంతమంది అమ్మాయిలు మాత్రం మోసగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. సోషల్‌ మీడియాతో అమ్మాయిలకు వలేస్తున్న కేటుగాళ్లు ముందు మంచివాళ్లగా నటిస్తూ, ఆ తర్వాత అసలు రంగు బయటపెడుతున్నారు. అయితే అప్పటికే తమ గుట్టంతా కేటుగాళ్ల చేతిలో పెడుతున్న అమ్మాయిలు ఆ తర్వాత లబోదిబోమంటున్నారు.

సేమ్‌ టు సేమ్ అచ్చం ఇలాంటి మోసమే హైదరాబాద్‌ సనత్‌‌నగర్‌లో జరిగింది. ఫేస్‌బుక్‌‌లో బాలికతో పరిచయం పెంచుకున్న కేటుగాడు హేమంత్ సాయి ఆ తర్వాత వేధింపులకు దిగారు. బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి, ఏకంగా బాధితురాలి తండ్రినే బెదిరించడం మొదలుపెట్టారు. 40లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే మీ అమ్మాయి ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ ఫ్రెండ్స్‌తో కలిసి బెదిరింపులకు దిగాడు.

కేటుగాడు హేమంత్‌సాయి బెదిరింపులకు బెదిరిపోయిన బాలిక తండ్రి ఇప్పటికే 11లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. అయినా, బెదిరింపులు, వేధింపులు ఆగకపోవడంతో బాలిక తండ్రి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజమండ్రిలో నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories