Hyderabad: రెండు రోజుల్లో పెళ్లి.. యువకుడి అదృశ్యం

Hyderabad: హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వరుడు అదృశ్యమయ్యాడు.

Arun Chilukuri
Published on: 16 Dec 2021 1:28 PM IST
Young Man Missing Mystery In Hyderabad
X

Hyderabad: రెండు రోజుల్లో పెళ్లి.. యువకుడి అదృశ్యం

Hyderabad: హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్న వరుడు అదృశ్యమయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయిగూడెంకు చెందిన సత్యనారాయణ గుప్తా అలియాస్ నాని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. సత్యనారాయణకు ఈనెల 17న వివాహం జరగాల్సి ఉంది. 13న రాత్రి కేపీహెచ్‌బీ కాలనీలో బస్సు ఎక్కినట్లు గుర్తించారు.

మరుసటి రోజు ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబసభ్యులు నగరానికి వచ్చి సత్యనారాయణ కోసం వివిధ చోట్ల విచారించారు. బస్సు ఎక్కి ఎస్‌ఆర్‌నగర్‌లో దిగిపోయాడని డ్రైవర్‌ వారికి చెప్పాడు. ఈ నెల 17న వివాహం జరగాల్సి ఉన్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story