Kishan Reddy: ప్రపంచంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో యోగా మహోత్సవ్

Kishan Reddy: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో యోగా మహోత్సవ్

Arun Chilukuri
Published on: 27 May 2023 10:26 AM IST
Yoga Mahotsav at Secunderabad Paradeground
X

Kishan Reddy: ప్రపంచంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో యోగా మహోత్సవ్

Kishan Reddy: యోగాతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్‌గా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన యోగా మహోత్సవ్‌లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. యోగా మహోత్సవ్ కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం ఈ ఏడాది యోగా డే వేడుకలకు 100 రోజుల ముందే శ్రీకారం చుట్టామన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర‌్భంగా ఆ రోజు ప్రతి ఒక్కరు ఇళ్లల్లో, కాలనీల్లో, గ్రామాల్లో యోగా చేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story