Yadadri: యాదాద్రిలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఆలయ తిరువీధుల్లో స్వామి వారి ఊరేగింపు

Yadadri: శ్రీ కృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి

Jyothi
Published on: 15 March 2024 3:10 PM IST
Yadadri Brahmotsavams 2024
X

Yadadri: యాదాద్రిలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఆలయ తిరువీధుల్లో స్వామి వారి ఊరేగింపు 

Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ కృష్ణాలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామి వారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Jyothi

Jyothi

Next Story