Hyderabad: రూ.20 కోట్ల శునకం హైదరాబాద్​లో హల్​చల్

Hyderabad: అరుదైన జాతికి చెందిన ఓ కుక్క హైదరాబాద్‌లో సందడి చేసింది.

Arun Chilukuri
Published on: 16 Dec 2023 4:08 PM IST
Worlds Costly Dog Roamed in Hyderabad
X

Hyderabad: రూ.20 కోట్ల శునకం హైదరాబాద్​లో హల్​చల్​

Hyderabad: అరుదైన జాతికి చెందిన ఓ కుక్క హైదరాబాద్‌లో సందడి చేసింది. మియాపూర్‌లోని విశ్వాస్ పెట్ క్లినిక్‌కు బెంగళూరుకు చెందిన కుక్క యజమాని సతీష్ దానిని సిటీకి తీసుకొచ్చాడు. దీంతో శునక ప్రియులు ఆ అరుదైన కుక్కను చూసేందుకు ఎగబడ్డారు. కుక్కతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కొకేషియన్ షెఫర్డ్ బ్రీడ్‌కు చెందిన ఈ కుక్క విలువ 20 కోట్లు ఉంటుందని యజమాని ‎తెలిపారు.

అయితే ఈ అరుదైన జాతి కుక్కను రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లు తెలిపాడు. మూడేళ్ల వయస్సు కలిగిన ఈ కుక్క రోజుకు మూడు కిలోల చికెన్‌ను ఆహారంగా తీసుకుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతో పాటు పలు సినిమాల్లో కూడా నటించినట్లు వివరించారు. ఈ డాగ్ మెయింటెన్స్‌కు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని సతీష్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story