సిటీలో మొదలైన న్యూ ఇయర్ డ్రగ్స్ కల్చర్.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hyderabad: సిటీలో న్యూ ఇయర్ డ్రగ్స్ కల్చర్ మొదలయ్యింది. చాపకింద నీరులా డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 16 Dec 2021 1:44 PM IST
Woman Software Engineer and two Others Arrested for Sharing Drugs in Hyderabad
X

సిటీలో మొదలైన న్యూ ఇయర్ డ్రగ్స్ కల్చర్.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hyderabad: సిటీలో న్యూ ఇయర్ డ్రగ్స్ కల్చర్ మొదలయ్యింది. చాపకింద నీరులా డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద డ్రగ్స్‌ కలిగిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా ఉంది. గోవా నుంచి హైదరాబాద్‌కు యువత డ్రగ్స్‌ను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 2 గ్రాముల గాంజాతో పాటు మేధాంఫెటిన్, ఎండీఎంఏ, ఎల్ఎస్‌డీ, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ వాడేందుకు గోవా నుంచి తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా ముగ్గురికి పరిచయం ఉన్నట్లు తేల్చారు పోలీసులు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో తరుచూ ముగ్గురు పార్టీలు చేసుకుంటున్నట్లు గోవాకి వెళ్లే అఖిల్‌కు డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురుని ఘట్‌కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story