Wine Shops: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ జిల్లాల్లో 2 రోజులు వైన్ షాపులు బంద్

Dhivi
Published on: 25 Feb 2025 2:20 PM IST
Wine shops in Telangana were closed for two days due to the MLC elections telugu news
X

Wine Shops: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ జిల్లాల్లో 2 రోజులు వైన్ షాపులు బంద్

Wine Shops: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో రెండు రోజులు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈనెల 27న రెండు ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రచారం మంగళవారం సాయంత్రం ముగుస్తుంది. దీంతో సైలెన్స్ పిరియడ్ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4గంటల నుంచి బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాల ద్వారా ప్రచారం నిషేధం. అభ్యంతకర, రాజకీయ పర అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపైనా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అదేవిధంగా ఈ 48గంటలపాటు మద్యం షాపులు కూడా బంద్ చేయాలని ఆదేశించింది.

ఎన్నికలు జరగనున్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ షాపులు మూతపడతాయి. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి గురువారం సాయంత్రం 4గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. రెండు రోజుల్లో సాధారణ మద్యం షాపులతోపాటు ఇతర రకాల మద్యం అమ్మకాలకు లైసెన్స్ పొందినవారు కూడా అమ్మకాలు చేయడం లేదా సర్వ్ చేయడంపై నిషేధాన్ని విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిద్యం చట్టం 1951, ఎన్నికల నియమావళి 1961 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం ఎక్కడ అమ్మినా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Dhivi

Dhivi

Next Story