మందుబాబులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌ !

Wine Shops in Hyderabad to be Closed for 2 Days in View of Bonalu
x

మందుబాబులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌ !

Highlights

Hyderabad: బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Hyderabad: బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం, సోమవారం.. పాతబస్తీ బోనాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు.

బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, మరియు రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఆబ్కారీ శాఖ. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం షాపులపై గట్టి నిఘా ఉంచుతామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories