దుబ్బాక ఉపఎన్నికలలో పోటీ ఛాన్స్ ఎవరికి దక్కేనో?

దుబ్బాక ఉపఎన్నికలలో పోటీ ఛాన్స్ ఎవరికి దక్కేనో?
x
Highlights

Who would get the chance to contest Dubbaka bye elections: సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Who would get the chance to contest Dubbaka bye elections: సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దివంగత ఎమ్మెల్యే కుటుంబసభ్యులకే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తుందా ఫ్యామిలీ మెంబర్సే బరిలో ఉంటే మద్దతిస్తామన్న కాంగ్రెస్‌ మాటపై నిలబడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ఆ మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుటుంబం యాక్టివ్‌ అయితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన సునీత లక్ష్మారెడ్డి కూడా దుబ్బాక టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

టీఆర్‌ఎస్‌ అధినేత మాటే శిరోధార్యంగా పదకొండేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు సోలిపేట రామలింగారెడ్డి. ఆయన అకాల మరణంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరుంటారనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరు నెలల్లోపు ఇక్కడ బై ఎలక్షన్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ రామలింగారెడ్డి భార్యకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తే పార్టీ పెద్దలతో మాట్లాడి పోటీ లేకుండా చూస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇలా అన్నారో లేదో అలా కాంగ్రెస్‌లోని మరో వర్గం కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చింది. గతంలో నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికలను గుర్తు చేస్తోంది. నారాయణఖేడ్‌లో సిటింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చనిపోతే, సంప్రదాయాలను పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిని బరిలో నిలిపిందని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ వ్యూహం ఏంటన్నది అంతుబట్టడం లేదు.

సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డిలలో ఎవరికి కేసీఆర్‌ టికెట్‌ ఇస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం సతీష్‌ రెడ్డి పేరును సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుటుంబం గురించి కూడా చర్చ మొదలైంది. టీడీపీ ఉన్నప్పుడు ముత్యంరెడ్డి, కేసీఆర్‌ సుదీర్ఘకాలం కలిసి పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు ముత్యంరెడ్డి. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోయినా సోలిపేట రామలింగారెడ్డి గెలుపుకోసం పనిచేశారు మాజీ మంత్రి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్టు ఆశిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ముత్యంరెడ్డికి మంచి పదవి ఇస్తానని అప్పటి ఎన్నికల ప్రచారంలో, సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దాంతో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ముత్యంరెడ్డేనని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్నాళ్లకే ముత్యంరెడ్డి చనిపోయారు. అప్పటి వరకూ తండ్రితోపాటు యాక్టివ్‌గా తిరిగిన ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలపై జరుగుతున్న చర్చలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా చేరారు. మరి సోలిపేట కుటుంబానికి టికెట్‌ ఇస్తారా శ్రీనివాస్‌రెడ్డిని పిలుస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి పరిస్థితి ఏంటనేది చూడాలి. ఒకవేళ సోలిపేట కుటుంబానికి టికెట్‌ ఇస్తే శ్రీనివాస్‌రెడ్డి సహకరిస్తారా అనేది కూడా ఆసక్తికరమే.

ఇప్పుడు అందరి దృష్టి గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌పైనే ఉంది. దుబ్బాకలో ఎలాంటి ప్లాన్‌ అమలు చేస్తారోనని చర్చించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సునీతా లక్ష్మారెడ్డిని పక్కన పెట్టి సోలిపేట రామలింగారెడ్డి కుమారుడికి అసెంబ్లీ టికెట్‌ ఇచ్చి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి నామినేటెడ్ పదవి ఆఫర్‌ చేస్తారా లేక శ్రీనివాస్‌రెడ్డికే అసెంబ్లీ టికెట్‌ ఇచ్చి రామలింగారెడ్డి కుమారుడికి నామినేటెడ్ పదవి ఇస్తారో అని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అలాగే దుబ్బాక ఏకగ్రీవం అవుతుందా లేక నారాయణ్‌ఖేడ్‌లా టగ్ ఆఫ్ వార్‌లా మారుతుందా అన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories