అతి త్వరలో డీఎస్‌ ఇవ్వబోతున్న పొలిటికల్ ట్విస్టేంటి?

అతి త్వరలో డీఎస్‌ ఇవ్వబోతున్న పొలిటికల్ ట్విస్టేంటి?
x
Highlights

ఆయన రాజకీయ కురవృద్దుడు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షునిగా రెండు...

ఆయన రాజకీయ కురవృద్దుడు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షునిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన రాజకీయ చతురత ఆయనది అంతటి రాజకీయ చాణక్యం ఉన్న ఆ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తు, ఏంటన్నది బోధపడ్డంలేదు. ఆయన సైలెంట్ వెనుక వ్యూహం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. అయితే, అతి త్వరలో ఆ లీడర్‌ పొలిటికల్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారని, ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఆయన ఇచ్చే ట్విస్టేంటి?

ధర్మపురి శ్రీనివాస్..రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకుడు. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన డి.ఎస్. ఆ పార్టీకి రాజీనామా చేసి, పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. గులాబీ పార్టీ కోటాలో రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నా రాజకీయంగా మాత్రం తన మార్క్ పాలిటిక్స్ చేయడం లేదు. కాంగ్రెస్ ను వీడి తప్పు చేశాసని పలు సందర్భాల్లో చెప్పిన డి.ఎస్, తిరిగి స్వగృహ ప్రవేశం చేస్తారని అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఐతే గత పార్లమెంట్ ఎన్నికల్లో తన క్యాడర్ అంతా కమలం పార్టీలోకి పంపి, అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో ఉంటూ తన కుమారుడు ధర్మపురి అర్వింద్ గెలుపుకు తెర వెనుక కృషి చేశారనే టాక్ ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆయన ప్యూచర్ పై క్యాడర్ లో టెన్షన్ పట్టుకుందట. అత్యున్నత పదవిలో ఉండాలనే ఆయన కోరిక ఎప్పటికి నెరవేరుతుందో తెలియక హైరాన పడుతున్నారట. రాజ్యసభ సభ్యునిగా పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతారా..? క్యాడర్ వెళ్లిన బీజేపీలో చేరి మళ్లీ యాక్టివ్ అవుతారా అన్నది తెలియక అసలు బాస్ వ్యూచరేంటని తెగ మధన పడిపోతున్నారట క్యాడర్.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యునిగా ఉన్న డి.శ్రీనివాస్, ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో జిల్లా ఎమ్మెల్యేలు డి.ఎస్. ను పార్టీ నుంచి బయటకు పంపేందుకు మూకుమ్మడిగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడంతో, ఆయన మనస్థాపం చెందారట. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉండిపోయారట. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ, గులాబీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆయనపై గుర్రుగా ఉందట. ఆయన కూడా గూలాబీ పార్టీలో అయిష్టంగా ఉంటున్నారట. మనస్సంతా కాంగ్రెస్ లో ఉంటే, క్యాడర్ కాషాయ పార్టీలో ఉన్నారట. మరి తమ నేత ఏ పార్టీలో తిరిగి యాక్టివ్ అవుతారో తెలియక, తలలు పట్టుకుంటున్నారట అనుచరులు. ఇప్పటికే ఓ కుమారుడు మాజీ మేయర్ సంజయ్ టీఆర్ఎస్ పార్టీలో ఉండగా రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా కాషాయ దళంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వయస్సు రిత్యా ఆయన పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటారా, తన మనస్సు ఉన్న పార్టీలో క్రియాశీలకంగా మారుతారా క్యాడర్ తో పాటు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్నది తేల్చుకోలేకపోతున్నారట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి, దేశ రాజకీయాల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న డి.శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుదన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories