భవిష్యత్తుపై బెంగతో మరో పార్టీ వైపు చూస్తున్న తెలంగాణ తమ్ముళ్లు?

భవిష్యత్తుపై బెంగతో మరో పార్టీ వైపు చూస్తున్న తెలంగాణ తమ్ముళ్లు?
x
Highlights

తెలంగాణలో టిడిపి ప్రమాదరంలో పడబోతుందా. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారానికి దూరం కావడంతో తెలంగాణ నేతలు నిరాశలో కూరుకుపోయారా. భవిష్యత్తుపై...

తెలంగాణలో టిడిపి ప్రమాదరంలో పడబోతుందా. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారానికి దూరం కావడంతో తెలంగాణ నేతలు నిరాశలో కూరుకుపోయారా. భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారా. ఉనికి కోసం పక్క చూపులు తప్పవని డిసైడయ్యారా. మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి, ఆపరేషన్‌ ఆఖర్ష్‌‌కు మరింత పదునుపెట్టిన పార్టీలోకి జంప్‌ కాబోతున్నారా....ఇంతకీ ఏ పార్టీలోకి వెళ్తున్నారు...కండువా మార్చబోతున్న కీలక నాయకులెవరు.ఆఖరి నిమిషం వరకూ పోరాడే చంద్రబాబు, జారిపోతున్న తెలంగాణ తమ్ముళ్లను పట్టుకుంటారా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ధైర్యం కోల్పోతోంది. ఆంద్రప్రదేశ్‌లో టిడిపి అధికారానికి దూరం కావడంతో, పార్టీ నేతలు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. ఇన్ని రోజులు పక్క రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉందన్న ధైర్యంతో నేతలు, పార్టీని పట్టుకుని ఉన్నారు. మూడు ఆందోళనలు, ఆరు ప్రెస్‌మీట్లు పెడుతూ తెలంగాణలో టీడీపీ ఇంకా ఉంది అనే ఆలోచనను సజీవంగా ఉంచగలిగారు. అయితే, ఏపీలో కూడా పార్టీ అధికారం కోల్పోవడంతో డీలా పడిపోయారు తెలంగాణ తమ్ముళ్లు. దీంతో ఉనికి కోసం పక్క చూపులు చూడక తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే, పార్టీ అధినేత ఏపీలో ఓటమి తరువాత హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే, పార్టీ పునరుజ్జీవం పోసుకుంటుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు టిటిడిపి నేతలు. కానీ ఏపిలో ఓటమి తరువాత అధినేత చంద్రబాబు భరోసా ఇవ్వకపోయారు. ఏపీకే తన తొలి ప్రాధాన్యత అని, అక్కడే ఉండి పార్టీని నిలబెట్టుకుంటానని తెలంగాణ నేతలతో చెప్పారట. అధినేత నుంచి భరోసా వస్తుందని ఆశించిన నేతలకు నిరాశే మిగిలిందట. దీంతో పార్టీలో ఉన్న నేతలంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి త్వరలో మరో పార్టీలో చేరాలని భావిస్తున్నారట. ఇంతకీ ఆ పార్టీ ఏదంటే, టీఆర్‌ఎస్‌ కాదు, భారతీయ జనతా పార్టీ.

కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీలో చేరడానికి తెలంగాణ తమ్ముళ్లలో కీలక నేతలు సిద్దమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నేతలంతా రహస్య భేటి నిర్వహించినట్లు తెలుస్తోంది. అందులో ఒకేరోజు అందరూ టిడిపిికి రాజీనామా చేసి వెంటనే బిజేపిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, తెలంగాణ కోటాలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సైతం తెలంగాణ కోటాలో బిజేపిలో చేరడానికి సన్నదం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, ఇక తెలంగాణలో టిడిపికి ఉనికి లేకుండా పోతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, జంపింగ్‌ జపాంగ్‌లతో తెలంగాణపై చంద్రబాబు పూర్తిగా ఆశలు వదులుకున్నారని, అందుకే ఆశక్తి చూపడంలేదని తెలుస్తోంది. అందువల్లే అందరూ ఎవరిదారి వారు చూసుకుంటున్నట్లు సమాచారం. దీనితో పాటు తెలంగాణ బిజేపికి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కూడా, తెలంగాణ తమ్ముళ్లను కాషాయం వైపు నడిపిస్తోంది.

తెలంగాణలో నాలుగు పార్లమెంట్‌ స్థానాలను కొల్లగొట్టిన బీజేపీకి, ఎనలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. అటు కాంగ్రెస్‌లో కీలక నేతలనూ లాగుతోంది. గెలిచిన, ఓడిన కాంగ్రెస్‌ ఎంపీలనూ ఆకర్షిస్తోంది. ఊరూరా బలమైన క్యాడర్‌ ఉన్న తెలుగుదేశాన్ని, టీఆర్ఎస్‌తో పాటు తానూ పంచుకుంటోంది బీజేపీ. వచ్చే సార్వత్రిక ఎన్నికలను తెలంగాణలో, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మార్చాలని తపిస్తోంది. దానికి తగ్గట్టే అస్త్రశస్త్రాలనూ ప్రయోగిస్తోంది. దీనిలో భాగంగానే అతిత్వరలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నేతలు మూకుమ్మడిగా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. బీజేపీ కీలక నేత రాంమాధవ్‌, హైదరాబాద్‌లో మకాం వేసి అటు ఏపీలోని టీడీపీ నేతలు, ఇటు తెలంగాణలోని టీడీపీ నేతలనూ టచ్‌లోకి తెచ్చుకుంటున్నారు. చూడాలి, రెండు రాష్ట్రాల్లో ఘోరంగా దెబ్బతిన్న తెలుగుదేశం భవిష్యత్తు ఎలా మారుతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories