Jagadish Reddy: ఏం ఆశించి పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లారో..?

Jagadish Reddy: 2001నుంచి ఇలాంటివి ఎన్నో చూస్తూ వచ్చాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Jun 2024 11:30 PM IST
What did Pocharam expect to join the Congress Says Jagadish Reddy
X

Jagadish Reddy: ఏం ఆశించి పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లారో..?

Jagadish Reddy: బీఆర్ఎస్‌కు ఒడిదుడుకులు కొత్త కాదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి. 2001 నుంచి ఇలాంటివి ఎన్నో చూస్తున్నామని.. రాజకీయ పార్టీలకు ఎత్తు పల్లాలు సహజమన్నారు. మళ్లీ ఫినిక్స్ పక్షిలా కేసీఆర్ లేచి నిలబడతారన్నారు. బాల్కసుమన్‌‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన. పోచారం బీఆర్ఎస్ నేత కనుక ఆయన ఇంటికి తమ నేతలు వెళ్లారని.. ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారిని విడుదల చేయాలన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్‌ను వీడటం దురదృష్టకరమని.. ఏం ఆశించి పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లారో తెలియదన్నారు. పోచారంకు కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు జగదీష్‌రెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story