భానుడి పంజా..రేడియేషన్‌ కేంద్రంగా భాగ్యనగరం!

భానుడి పంజా..రేడియేషన్‌ కేంద్రంగా భాగ్యనగరం!
x
Representational Image
Highlights

కొన్ని రోజులుగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజు ఉష్ణోగ్రతలు పెరిగుపోతున్నాయి. యూవీ కిరణాలు పంజా విసురుతున్నాయి.

కొన్ని రోజులుగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజు ఉష్ణోగ్రతలు పెరిగుపోతున్నాయి. యూవీ కిరణాలు పంజా విసురుతున్నాయి. మరో వారం రోజుల వరకు పరిస్థితి ఆందోళనకరంగానే ఉండే అవకాశం ఉందని డబ్ల్యూఈవో అంచనా వేసింది. యూవీ సూచిక అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని ప్రపంచ పర్యావరణ సంస్థ తెలిపింది.

ఈ నేపథ్యంలో డబ్ల్యూఈవో ప్రతిరోజు ప్రధాన నగరాల యూవీ సూచికను రూపొందిస్తోంది. భూ ఉపరితలంపై రేడియేషన్‌ ప్రభావాన్ని ఇది వెల్లడిస్తుంది. కాగా.. సూర్యుడి నుంచి వచ్చే ఎండ వేడిలో నేరుగా మనిషి శరీరంలోకి చొచ్చుకునిపోయే శక్తిమంతమైన యూవీ కిరణాలు ఉంటాయి. వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే చర్మం మండినట్లుగా అనిపిస్తుంది.

సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత ( యూవీ ) కిరణాలను సహజంగా స్ట్రాటోస్పియర్‌లో ఉండే ఓజోన్‌ పొర అడ్డుకుంటుంది. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల తీవ్రత పెరిగే కొద్దీ ఈ పొర మందం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీని ద్వారా చర్మ సంబంధమైన అలర్జీలు, కళ్ల రుగ్మతలకు కారణమవుతాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎండాకాలం ఈ సమస్యలతో వైద్యులను సంప్రదించే వారి సంఖ్య 20 శాతం పెరుగుతుందని సమాచారం

హైదరాబాద్ లో సోమవారం నమోదైన యువీ కిరణాల చూస్తే.. 12 పోయింట్ల వరకు నమోదైనట్లు ప్రపంచ పర్యావరణ సంస్థ తెలిపింది. జూన్ 2వ తేదీ వరకు ఇలానే ఉంటుందని అంచనా వేసింది. సాధారణంగా.. యువీ సూచిక 1 నుంచి 5 పాయింట్లు ఉంటే మధ్యస్తం, 6 నుంచి 10 పాయింట్లు ఉంటే అతి ఎక్కువని, 11 నుంచి పైకి ఉంటే తీవ్రంగా ఉందని ప్రపంచ పర్యావరణ సంస్థ(డబ్ల్యూఈవో) తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories