CM KCR: ఆదివాసీలపై పెట్టిన పోడు భూముల కేసులన్నీ ఎత్తివేస్తాం

We Will Remove All Cases Of Wasteland Against Tribals Says KCR
x

CM KCR: ఆదివాసీలపై పెట్టిన పోడు భూముల కేసులన్నీ ఎత్తివేస్తాం 

Highlights

CM KCR: మిషన్‌ భగీరథ ద్వారా మన్యంకు మంచినీరు అందిస్తున్నాం

CM KCR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసుకొచ్చిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గ ఆదివాసీలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీలకు రైతుబంధు చెక్కులను సైతం అందించారు. పోడు పట్టాలన్నింటినీ మహిళల పేరు మీదే అందిస్తున్నామని.. రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 51 వేల మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ పోడు విషయంలో గిరిజన రైతులు కాకుండా గిరిజనులు కానివారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో అడవులను ఆక్రమించారని కొంతమంది గిరిజనుల మీద కేసులు నమోదయ్యాయని... ప్రభుత్వమే ఈరోజు వారికి పట్టాలిచ్చి.. రైతు బంధును మంజూరు చేసిందన్నారు. వారిమీద నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించామని వివరించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా అంతకుముందు ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories