Vinod Kumar: మార్కెటింగ్‌లో రేవంత్‌ను మించినోడు లేడు.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Vinod Kumar: తెలంగాణలో నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామక పత్రాల కేంద్రంగా మాటల యుద్ధం నడుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2024 3:56 PM IST
Vinod Kumar Sensational Comments On CM Revanth Reddy
X

Vinod Kumar: మార్కెటింగ్‌లో రేవంత్‌ను మించినోడు లేడు.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Vinod Kumar: తెలంగాణలో నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామక పత్రాల కేంద్రంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఉపాధ్యాయుల నియామకాల‌ ప్రోగ్రాంను సీఎం రేవంత్‌ రాజకీయ వేదికగా వాడుకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. మార్కెటింగ్‌లో రేవంత్ రెడ్డిని మించినోడు లేడని..గత ప్రభుత్వ నోటిఫికేషన్లనూ ఆయనే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని వినోద్ విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో ల‌క్షా 60 వేల ఉద్యోగాలను కేసీఆర్ భ‌ర్తీ చేయ‌లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి,ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్రమార్క చెప్పగ‌ల‌రా..? అని స‌వాల్ విసిరారు వినోద్. నిన్న మీరు ఇచ్చిన ఉపాధ్యాయ నియామకాలు కూడా సెప్టెంబర్ 6, 2023 నాడు ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపే. కేవలం ఆరు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్‌లో అదనంగా కలిపార‌ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story