Telangana: గ్రామాలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి

Telangana: గ్రామాలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి
x
Highlights

నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి మండల ప్రత్యేక అధికారి తో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

నిర్మల్: నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి మండల ప్రత్యేక అధికారి తో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలను అందంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు గైకొనాలి అన్నారు. మండలంలో ఎంపిక చేసిన రెండు గ్రామల ప్రవేశ మార్గం ( ముఖద్వారం) వద్ద అందంగా కనిపించేలా రోడ్డు ప్రక్కన గల ఇంటి గోడలకు వైట్ వాష్, ముగ్గులు వేయించాలని, స్వయం సహాయక సంఘ సభ్యులచే శ్రమదానం ద్వారా సున్నం వేయించాలి అన్నారు.

రోడ్డుకు ఇరువైపులా ఇరువైపులా మొక్కలు నాటిన చాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు పల్లె ప్రగతి సందర్భంగా గ్రామం నుంచి వేరే గ్రామం వెళ్లే సమయంలో త్రోవలో రోడ్డుపై చెత్త లేకుండా చూడాలన్నారు ఇందుకోసం ఒక ట్రాక్టర్, ముగ్గురు కూలీలను వెంట తీసుకొని వెళ్లి శుభ్రం చేయించాలన్నారు. గ్రామాల్లో కిరాణా షాపుల ముందు, హోటళ్ళ ముందు, వైన్ షాపుల ముందు ప్లాస్టిక్ లేకుండా చూడాలన్నారు. ప్రతి షాపు యజమాని కనీసం వంద గజాల వరకు చెత్త లేకుండా చూడవలసిన బాధ్యత షాపు యజమాని దే అన్నారు.

షాపుల ముందు చెత్త ఉంటే భారీ జరిమానా విధించాలని సూచించారు. ప్రతి షాపు ముందు డస్ట్ బిన్ ఉండేలాచూడాలన్నారు.ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికి డస్ట్ బిన్ లు అందించాలన్నారు. గ్రామాల్లో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రతి గ్రామంలో నిరక్షరాస్యుల డేటా నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో కరీం, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories