Vikarabad: శిరీష హత్య కేసులో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు.. అక్క భర్తే హంతకుడు..

Vikarabad Sireesha Murder Case: వికారాబాద్‌ జిల్లాలో 19 ఏళ్ల యువతి హత్య కేసులో సంచలన ట్విస్ట్ బయటపడింది.

Arun Chilukuri
Published on: 12 Jun 2023 11:01 AM IST
Vikarabad Shirisha Murder Sister Husband is the Culprit
X

Vikarabad: శిరీష హత్య కేసులో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు.. అక్క భర్తే హంతకుడు.. 

Vikarabad Sireesha Murder Case: వికారాబాద్‌ జిల్లాలో 19 ఏళ్ల యువతి హత్య కేసులో సంచలన ట్విస్ట్ బయటపడింది. అత్యంత ఆటవికంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసి కుంటలో పడేసింది ఎవరనేది పోలీసులు గుర్తించారు. శిరీష రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటే ముందు.. అక్క భర్త అనిల్‌తో గొడవ జరిగినట్టు.. ఆ గొడవలో శిరీషను అనిల్ కొట్టినట్టుగా స్థానికులు పోలీసులకు తెలిపారు.

దీంతో.. అనిల్ మీద అనుమానం వచ్చిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఒక్కోసారి ఒక్కో రకంగా పొంతన లేకుండా చెప్తూ.. పోలీసులనే కన్ప్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు అనిల్. దీంతో పోలీసులు మరింత గట్టిగా విచారణ చేపట్టారు. అంతే కాదు శిరీష మొబైల్ విషయంలో గొడవ జరిగినట్టు శిరీష అన్న కూడా చెప్పటంతో ఆ కోణంలో కూడా పోలీసులు కూపీ లాగారు.

ఇటీవలే కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన శిరీష.. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉండటంతో అన్న మందలించాడు. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటున్నావంటూ తిట్టటంతో గొడవ జరిగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన అనిల్ శిరీషను మందలించటంతో పాటు కొట్టాడు. దీంతో శిరీష తీవ్ర మనస్తాపానికి గురైంది.

దీంతో అర్ధరాత్రి కలుద్దామని బావ అనిల్ శిరీషను బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత తలుపును బయట నుంచి గడియపెట్టి వచ్చేసింది. అయితే ఇద్దరు కలుసుకున్న తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో శిరీషపై అత్యాచారం చేసిన అనిల్.. కోపంతో శిరీషను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అక్క భర్త అనిల్, శిరీషకి మధ్య వివాహేతర సంబంధం కూడా ఉందని పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story