Spy Camera: మహిళలు జాగ్రత్త.. స్పై కెమెరాలతో మహిళల నగ్న చిత్రాలు రికార్డింగ్‌

* షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు, రెస్టారెంట్ల వాష్‌ రూంలలో సీక్రెట్‌ కెమెరాలు

Arun Chilukuri
Updated on: 25 Sept 2021 4:34 PM IST
Video Recording with Spy Cameras at Ladies Washrooms in Hyderabad
X

స్పై కెమెరాలతో మహిళల నగ్న చిత్రాలు రికార్డింగ్‌

Spy Camera: కుటుంబ‌స‌మేతంగా లేదా స్నేహితుల‌తో స‌ర‌దాగా డ్రైవ్ ఇన్, షాపింగ్ మాల్స్ లేదా సినిమా ధియేట‌ర్లకు వెళ్తున్నారా సేఫ్టీ కొర‌కు సీసీ కెమెరాలు ఉన్నాయి స‌రే వాటిని మించిన సీక్రెట్ కెమెరాలు ఎర్పాటు చేస్తున్నారు క‌న్నింగ్ గాళ్లు. అది కూడా మ‌హిళ‌ల వాష్ రూమ్స్, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దుల్లో ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.

యువ‌తులు, మ‌హిళ‌లను టార్గెట్ చేసుకొని సీక్రెట్ ప్లేసెస్‌లో స్పై, మొబైల్ కెమెరాలు అమ‌ర్చి న‌గ్న దృశ్యాల‌ను చిత్రీక‌రిస్తున్నారు కొంద‌రు నీచులు. హైదరాబాద్‌ న‌గ‌రంలోని వ‌న్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లేడీస్ వాష్ రూమ్ లో హౌప్ కీపింగ్ చేసే మైన‌ర్ బాలుడు మొబైల్ కెమెరా అమ‌ర్చి దాదాపు నాలుగున్న‌ర గంట‌ల వీడియో రికార్డ్ చేసాడు. అందులో దాదాపు 25 మంది యువ‌తుల ఫుటేజ్ ఉండ‌డంతో ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది.

ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారు వీడియోల‌ను పోర్న్ సైట్స్ కు అమ్ముకుంటున్నారు. చాలా మంది పోర్న్ సైట్స్ లో వీడియో అప్ లోడ్ అయ్యాక అలెర్ట్ ఐన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా మాజీ కేంద్ర‌ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ త‌ర‌హా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే న‌టి త్రిషా న‌గ్న వీడియో అంటూ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన విష‌యం తెలిసిందే. ఇలా బ‌య‌ట‌ప‌డిన‌వి కొన్ని మాత్ర‌మే.

కానీ తెలియ‌కుండా ఇంకా ఎన్ని జ‌ర‌గుతున్నాయో అనే అనుమానాలు, ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. అత్యాధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింద‌ని సంబరప‌డాలో దాని మిస్ యూజ్ చేస్తున్నందుకు బాధ‌ప‌డాలో అర్ధం కావ‌ట్లేద‌ని సామాజిక కార్య‌క‌ర్త దేవి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story