ఓసీ నేతలు పార్టీ కోసం త్యాగం చేయాలి ‌: వీహెచ్

ఇంచార్జ్ ల నుంచి తీసుకున్న అభిప్రాయమే కాకుండా అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం కూడా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

admin
Updated on: 11 Dec 2020 8:00 PM IST
ఓసీ నేతలు పార్టీ కోసం త్యాగం చేయాలి ‌: వీహెచ్
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో అధిష్టానం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. ఇంచార్జ్ ల నుంచి తీసుకున్న అభిప్రాయమే కాకుండా అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం కూడా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలకు పీసీసీ ఇవ్వకుంటే అణగారిన వర్గాలకు పార్టీకి దూరమవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ లో ఓసి నేతలు పార్టీ కోసం త్యాగం చేయాలని వి. హనుమంత రావ్ అన్నారు.

అటు తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధికి సంబంధించి ప్రక్రియ వేగవంతం అయింది. పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఏఐసీసీ ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇవాళ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ల అభిప్రాయాలను సేకరించనున్నారు.

admin

admin

Next Story